తెలంగాణ

కరీంనగర్ కలెక్టర్‌పై బదిలీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై బదిలీ వేటు పడింది. గద్వాల-జోగులాంబ జిల్లా కలెక్టర్ శశాంక్‌ను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించి, సర్ఫరాజ్ ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా బది లీ అయ్యారు. గద్వాల కలెక్టర్ శశాంక కరీంనగర్‌కు బదిలీ కావడంతో వనపర్తి కలెక్టర్ శే్వత మహంతికి గద్వాల కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న అశోక్‌ను అక్కడి నుంచి ఇటీవల బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, తాజాగా జరిగిన బదిలీల్లో అశోక్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమించి, ప్రస్తుతం అదనపు డీజీగా కొనసాగుతున్న బూసాని వెంకటేశ్వర్లును విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాఉండగా కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ బది లీ వెనుక బలమైన కారణాలే ఉన్నా యి. బీజేపీకి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిపిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి వివరణ కోరిన విష యం తెలిసిందే. ఈ ఉదంతాన్ని తీవ్రం గా పరిగణించిన
ప్రభుత్వం సర్ఫరాజ్ అహ్మద్‌ను తాజాగా ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించింది. గత శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ విజయం సాధించారు. ఈ ఎన్నికపై ఎన్నికల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా జరిగిన ఫోన్ సంభాషణల్లో కలెక్టర్ తనకు వ్యతిరేకంగా ఎంపీకి సూచనలు, సలహాలు ఇచ్చారని మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకున్నాకే సర్ఫరాజ్‌పై బదిలీ వేటు వేసినట్టు తెలిసింది.

*చిత్రం...కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌