తెలంగాణ

ఐటీలో పెట్టుబడులకు ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై తమకు చాలా సానుకూల అభిప్రాయం ఉందని కెనడా వౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా వెల్లడించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తమ పారిశ్రామిక వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ పండా మాట్లాడుతూ కెనడా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించడానికి కెనడాలో పర్యటించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కెనడాకు రానున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపినట్టు ఆయన చెప్పారు. బతుకమ్మ పండుగను తాము కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు మంత్రికి ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడపడంతో అధికారంలోకి వచ్చాక ఎదురైన ఇబ్బందులు, సవాళ్లను సీఎం కేసీఆర్ అధిగమించారని కెనడా మంత్రి కొనియాడారు. తమ దేశంలో సహజ వనరులు ఉన్నాయని, భారత్‌లో మానవ వనరులున్నాయని ఈ రెండింటి కలయికతో మరిన్ని వ్యాపార అవకాశాలు ఏర్పడతాయన్న ఆశాభావాన్ని ప్రసాద్ పండా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్ వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల వివరాలను మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం...రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో సోమవారం సమావేశమైన కెనడా వౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా