తెలంగాణ

నేడు యాదాద్రికి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవా రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం యాదాద్రికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఆగస్టు 17న యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించి మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు నిర్ధేశించారు. నల్లసరం కృష్ణ శిలలతో నిర్మితమవుతు న్న ప్రధానాలయం పనులు శిల్పకళతో కూడి సాగుతుండడంతో జాప్యం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మంగళవారం మరోసారి యాదాద్రిని సందర్శించి లక్ష్మీనరసింహుడి నూతన ఆలయం పనుల పురోగతిని, టెంపుల్ సిటీ నిర్మాణ పనులను, కాటేజీల నిర్మాణ పనులను, నవగిరుల అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్షిస్తారు. పునర్ నిర్మాణ ఆలయంలో దర్శనాల పునరుద్ధరణకు అనుమతించే ముందుగా కేసీఆర్ తలపెట్టిన మహా సుదర్శన యాగం, సహస్ర కుండాత్మక యాగం నిర్వహణ అంశాలపై, తేదీలపైన కూడా ఆయన స్పష్టతనిస్తారని భావిస్తున్నారు. మహా సుదర్శన యాగానికి పలువురు పీఠాధిపతులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించనున్నట్లు గతంలో కేసీఆర్ ప్రకటించినందున, అందుకు తగ్గ ఏర్పాట్లపై కూడా ఆయన సూచనలివ్వనున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. హెలిప్యాడ్, రోడ్డు మార్గాలను సిద్ధం చేస్తూ అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

*చిత్రం...ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు