తెలంగాణ

భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, డిసెంబర్ 16: దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో సోమవారం మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న సందర్భంగా ఆగి కార్యకర్తలతో కలిసి కరచలనం చేశారు. మండల సమస్యలపై మాజీ జడ్పీటీసీ తండు సైదులగౌడ్, ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో ఉన్న సమస్యలపై తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం ఈనెల అధికారులతో రివ్యూ మీటింగ్‌లో చర్చించి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తండు నర్సింహ్మగౌడ్, ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మండల విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీ.సుధీర్‌కుమార్, నాగేశ్వర్‌రావు, పల్లె శేఖర్, మహ్మద్ గౌస్‌పాష, లక్ష్మణ్, వనపర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... కార్యకర్తలతో మాట్లాడుతున్న ఉత్తమ్‌