తెలంగాణ

పసుపు రైతుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 16: పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లాలోని పసుపు రైతులు జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీతో వెళ్ళి ప్రజావాణికి చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. అనంతరం జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అన్నారు. ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పసుపుబోర్డు ఏర్పాటుకు హామీ ఇవ్వడంతోనే రైతులు ఆయనను గెలిపించారని అన్నారు. కాని అర్వింద్ గెలిచి ఆరు నెలలు గడిచినప్పటికీ పసుపుబోర్డు ఏర్పాటుచేయడం, చర్యలు తీసుకోకపోవడం రైతులను మోసం చేసినట్టేనని అన్నారు. అనంతరం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.

*చిత్రం... ఆందోళన చేస్తున్న పసుపు రైతులు