తెలంగాణ

జీఎస్‌టీతో నష్టాన్ని కేంద్రమే పూడ్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: జీఎస్‌టీ అమలులో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం తక్షణం పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. జీఎస్‌టీ వసూళ్లపై రాష్ట్రాలకున్న హక్కును కాలరాసి, కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై విశ్వాసం ఉంచి సహకరించామన్నారు. అయితే దీనివల్ల రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్, ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రాల నుంచి పన్ను వసూలు 47 శాతం ఉండగా, కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే ఇస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్రం నుంచి పన్ను వసూలు అవుతున్న సమగ్ర వివరాలను గణాంకాలతో సహా మంత్రి వివరించారు. తక్షణం తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.450 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. మిషన్ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని మంత్రి వివరించారు. ఈ సిఫారసులను కేంద్ర ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత భారీ
వ్యయాన్ని తమ రాష్ట్రానికి భారంగా మారిందని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిధులు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేయాలని ఉందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలోని 10 పూర్వ జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలేనని ఆయన గుర్తు చేశారు. బయ్యారంలో సమీకృత స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రుల స్థాయి కమిటీ చేసిన సిఫారసులు అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. ఇలాఉండగా నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కూడా మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
*చిత్రం...న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు