తెలంగాణ

మోసం.. దగా.. విశ్వాస ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రజలను ఆశల పల్లకిలో ఎక్కించి రెండోసారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఏడాది పాలనలో అన్నింటా వైఫల్యం చెంది రాష్ట్ర ప్రజలను మోసం, దగా, విశ్వాస ఘాతుకాలకు గురిచేశారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాకేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదని, రుణాలు లేక రైతులు అల్లాడుతున్నా కేసీఆర్ కనీస కనికరం చూపడం లేదన్నారు. ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న రైతుబంధు పథకం రాష్ట్రంలో రైతులకు అందడం లేదని, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల వల్ల ఒక్క ఆ నియోజకవర్గంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా మొదటి పంట సాగుకే రైతుబంధు అందని దుస్థితి నెలకొందన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు లాంటి ప్రధాన హమీలను అమలు పర్చకుండా కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ఆర్టీసీ సమ్మెపై నిరంకుశత్వం కారణంగా 60 మంది విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులను బలిగొన్నాడని ఆరోపించారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణకు రూ.69 వేల కోట్ల అప్పులు ఉండగా మహానుభావుడు కేసీఆర్ ఆరేళ్ల పాలనలో రూ. 3లక్షల కోట్లకు అప్పులు పెరిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులమయంగా మారిందన్నారు. హామీల అమలు, సంక్షేమ పథకాల నిర్వహణలో విఫలమై మాయమాటలతో కేంద్రం, గత పాలకులపై నెపలను నెడుతూ ప్రజలను మోసగించేందుకు యత్నిస్తున్నాడన్నారు. అనేక పథకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని చెబుతున్న కేసీఆర్ పాలనలో మద్యం అమ్మకాల్లో ప్రగతి తప్ప మరేమీ జరగలేదని, గతంలో రూ.11వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం కేసీఆర్ పాలనలో నేడు రూ.25 వేల కోట్లకు చేరి దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఈ ప్రగతిని చూసి కేసీఆర్‌ను శపించాలో, అభినందించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌బీమా యోజన పథకం జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదని దీంతో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి జిల్లాలోని ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని ఉత్తమ్ హామీనిచ్చారు. జిల్లాలో మినరల్ ఫండ్ మంజూరు, వినియోగం ఏకపక్షంగా జరుగుతుందని గుర్తించామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, నాయకులు గుడిపాటి నర్సయ్య, కోతి గోపాల్‌రెడ్డి, కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్