తెలంగాణ

ఇక్కడి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వినూత్న తరహా సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 313 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన కల్యాణ లక్ష్మీ. షాదీ ముబారక్ పథకాలు మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న కల్యాణ తాంబూలాలని, చెక్కులు అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో వెలుగులు నింపుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇంటికి పెద్దకుమారుడిలా అలోచించి రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక లబ్ధి పొందని వారంటూ లేరని అన్నారు. నియోజకవర్గంలో 40 సంవత్సరాలు తరువాత చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయంటే టీఆర్‌ఎస్ పార్టీ వల్లనే అన్నారు. కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మీ, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టి కుటుంబానికి తండ్రి అయ్యాడని చెప్పారు. ఆడపిల్లల తండ్రులకు పెళ్లి భారం కాకూడదనే షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలను తీసుకవచ్చారని తెలిపారు. ప్రధానమంత్రి పాలిస్తున్న రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలపై ప్రజలు ఆశీర్వాదాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపికయుగేంధర్, జడ్పీటీసీలు జీడి బిక్షం, మామిడి అనిత, భూక్య సంజీవనాయక్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీలు నెమ్మాది భిక్షం రవీందర్‌రెడ్డి, వెంకన్న, రాణీనాయక్, ఆర్డీఓ మోహన్‌రావు తదితరులు ఉన్నారు.
*చిత్రం...కల్యాణ లక్ష్మిచెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి