తెలంగాణ

డ్రై రన్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 18: గత నాలుగు దశాబ్దాల నుంచి తమ పొలాలకు కృష్ణా జలాలు అందించాలని మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం చేసిన పోరాటాల కల త్వరలోనే ఫలించనుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడమే ఆలస్యం. కృష్ణా జలాలను ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసి బీడువారిన పొలాల్లోకి అందించాలని ప్రభుత్వం సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా గుడిపల్లిగట్టు లిఫ్ట్-3 పంపుల ద్వారా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహదారు పెంటారెడ్డి డ్రైరన్ నిర్వహించారు. డ్రైరన్ విజయవంతం కావడంతో ఇక కృష్ణానది జలాలు పారించడమే తరువాయిగా అధికారులు భావిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందుతుండగా లిఫ్ట్-2 జొన్నలబొగడ, లిఫ్ట్-3 గుడిపల్లిగట్టు నుండి ఒక్కొక్క పంపు ద్వారా 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి సర్వం సిద్ధం చేశారు. దీంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల్లో ఈ ఏడాది కొంతైన సాగునీరు అందుతుందని ఆశలు చిగురిస్తున్నాయ. ఇటీవల మంత్రి హరీష్‌రావు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షలు జరిపి జూలై చివరినాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నుండి అనుకున్న లక్ష్యంగా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించడం దాంతో ప్రాజెక్టు అధికారులు పంపుహౌస్‌ల పనులు దాదాపు పూర్తి చేయడం రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఏదేమైనా మూడు నాలుగు దశాబ్దాల కల ఫలించే రోజు దగ్గరలో ఉండడంతో పాలమూరు రైతాంగం కృష్ణాజలాలు తమ పొలాల్లోకి ఎప్పుడు వచ్చి పారుతాయోనని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.