తెలంగాణ

పేద ముస్లింలే ఓవైసీ పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పేద ముస్లింలే ఓవైసీ పెట్టుబడి అని వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధా న కార్యదర్శి సుందర్‌జైన్ వ్యాఖ్యానించారు. ము స్లింలకు పెద్దన్నగా చెప్పుకునే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీనే ముస్లింలకు అతి పెద్ద శత్రువని ఆయన పేర్కొన్నారు. పేద ముస్లింలను, అమాయక ముస్లింలను రెచ్చగొట్టి భారతదేశంపై ద్వేషాన్ని నింపుతున్నారని, దీంతో రాజకీయ పలుకుబడి, ధనం పెంచుకుంటున్నారని ఆరోపించారు. శనివారం నాడు ఆయన ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ విదేశాల్లో ఇంగ్లీషు నేర్చుకున్న ఓవైసీ బ్రదర్స్ భారతదేశంలో మున్సిపల్ స్కూల్ లో చదువుకున్న వారికన్నా ఘోరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సీఏఏ విషయంలో ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, అయినా వారిని రెచ్చగొట్టి రోడ్లమీదకు తోస్తున్నారని అన్నా రు. పథకం ప్రకారమే సమాజు చేసిన తర్వాత శుక్రవారం రోజున ముస్లింలు నిరసనలు తెలియజేస్తున్నారని, అయితే నిరసనల రూపంలో హింసకు పాల్పడడం నా గరికం కాదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో అక్రమంగా చొరబడ్డ రోహింగ్యా ము స్లింలను తరిమేయాలని, సీఏఏ అమలు చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటులో గగ్గోలు పెట్టారని, ఆ వీడియోలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి మమతా బెనర్జీ నేడు సీఏఏను వ్యతిరేకించడం కేవలం ఓట్ల కోసమే తప్ప మరొకటి కాదని సురేంద్రజైన్ అన్నారు. సీఏఏ వల్ల ఈ దేశంలోని ముస్లింలకు గడ్డిపరక అంత కూడా అన్యాయం జరగదని ఈ దేశంలోని అన్ని పార్టీలకూ తెలుసని, కానీ కేవలం ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తూ అమాయక ముస్లింలను రెచ్చగొట్టి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయని విమర్శించారు. తమ రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలు
ఎన్‌ఆర్‌సీని అస్త్రంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ- సీఏఏలలో వాస్తవాలఅన్నీ తొక్కిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేసేందుకు అర్బన్ నక్సలైట్లు అజెండాగా తయారుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో, పత్రికా సమావేశాల్లో ఆ పార్టీల నేతలు అవాస్తవాలు వెళ్లగక్కుతున్నారని అన్నారు. దేశ సంపదను ధ్వంసం చేసి, రైళ్లను, బస్సులను తగులబెట్టి దేశ సంపదను కొల్లగొట్టేవాడు ఎన్నటికీ ఈ దేశ పౌరుడు కానేరడని జైన్ చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌లలో మూలాలతో బతుకుదెరువు కోసం భారత్‌కు వచ్చిన వారు ఈ దేశాన్ని కబళించాలని కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశ సంపదను అనుభవిస్తూ అదే సంపదను సర్వనాశనం చేసేవాడు దేశద్రోహి అవుతారని స్పష్టం చేశారు. సమావేశంలో వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర కార్య అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కార్యదర్శి బండారి రమేష్, సహకార్యదర్శులు పుల్ల సత్యనారాయణ, జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, వెంకటేశ్వరరాజు, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, నాగరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
* వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సుందర్‌జైన్