తెలంగాణ

మహిళా టీచర్స్ డేగా సావిత్రి పూలే జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆ రోజున మహిళా టీచర్స్ డేగా గుర్తించాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత విభాగానికి చెందిన భూపతి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 3వ తేదీ వరకు సాంస్కృతిక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వారోత్సవాల్లో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని టీపీఎస్‌కే డైరెక్టర్, ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ వారోత్సవాల్లో పాల్గొనే ఔత్సాహికులు తమ రచనలను పంపవచ్చునన్నారు. కాలేజీ, హైస్కూల్ విద్యార్థులతో సావిత్రిబాయి పూలే జీవితంపై సాహిత్యంపై వ్యాస రచన పోటీలు, ఉపన్యాసాలు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కవులు, రచనల నుంచి కవితలు, వ్యాసాలు పంపుకోవచ్చు. ఉత్సవాల్లో పాల్గొనే ఔత్సాహికులు 94900-98343 మొబైల్ ఫోన్‌కు సంప్రదించవచ్చునని భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు.