తెలంగాణ

రాజ్యాంగం నాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రయత్నిస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ట్యాంక్‌బండ్ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జే గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం
చేసిందన్నారు. కాంగ్రెస్ ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. ఆందోళనకారుల పట్ల పోలీసుల అనుచిత వైఖరి సరికాదన్నారు. యూనివర్శిటీలో పెద్ద మొత్తంలో పోలీసు బలగాల మోహరింపును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీన గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహిస్తామన్నారు. దీనికి పోలీసుల అనుమతి కోరినట్లు ఆయన చెప్పారు. పార్టీ సీనియర్ నాయకురాలు జే గీతారెడ్డి మాట్లాడుతూ లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం లౌకికవాదానికి ప్రతీక అని అన్నారు. లౌకిక శక్తులను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులను తిప్పికొడతామన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానమని, కానీ కొత్త పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు.

'చిత్రం...సీఏఏ బిల్లుకు నిరసనగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన