తెలంగాణ

పౌరసత్వాన్ని ఇచ్చేది మాత్రమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 22: ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉంటూ తీవ్ర వివక్షకు గురై శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించేదే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేషనల్ ఆఫీషియల్ స్పోక్స్‌పర్సన్ జీవీఎల్ నర్సింహారావు పేర్నొన్నారు. ఆదివారం సోమాజిగూడ కత్రీయా హోటల్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019పై మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవిఎల్ నర్సింహారావు, బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌లు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం.. దేశంలో నివసిస్తున్న ఏ ఒక్కరికీ హాని కలిగించేది కాదని స్పష్టం చేశారు. దేశ విభజన సమయంలో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసేందుకే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ చట్టంపై చర్చ జరుగుతూనే ఉందని అన్నారు. కాంగ్రెస్ చేతకాక, చేవలేక చేయలేని చట్టాన్ని తెచ్చామని అన్నారు. భారతదేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు మోదీ, అమిత్ షాల నేతృత్వంలో అద్భుతమైన చట్టాలు తీసుకువస్తుంటే కాంగ్రెస్ విషం చిమ్ముతుందని విమర్శించారు. దేశంలోని మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు దేశం వెలుపల మైనారిటీలుగా ఉన్న వారి గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే సమస్యేలేదని చెప్పారు.
నిజమైన లౌకికవాదం బీజేపీదని, రాజకీయ లబ్ధి కోసం మైనారిటీలను మభ్యపెట్టకుండా దేశ ఉన్నతి ప్రణాళికలతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
'చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న జీవీఎల్ నర్సింహరావు