తెలంగాణ

అమిత్‌షాను తప్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షాను హోంశాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ మంత్రి అమిత్‌షాను కట్టడి చేయలేకపోతున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్లమెంటులో అమిత్‌షా మాట్లాడిన తీరు బాగాలేదన్నారు. దేశ ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే, దూకుడు స్వభావం కలిగిన అమిత్‌షాను హోంమంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు. ఈ చట్టంపై పునఃసమీక్ష చేయాలన్నారు. ఈ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చిస్తున్న సమయంలో మోదీ ఎందుకు ఉభయ సభలకు హాజరు కాలేదన్నారు. ఎన్‌ఆర్‌సీ గురించి ఏ స్థాయిలో చర్చ జరగనప్పుడు హోంమంత్రి అయిన అమిత్‌షా, ఎస్‌ఆర్‌సీ అమలు చేసి తీరుతామని సభలో ఎలా ప్రకటిస్తామన్నారు. ఇస్లామిక్ దేశాల్లో తన పరపతి పెరగడం చూసి ఓర్వలేక కాంగ్రెస్ రెచ్చగొడుతున్నదంటున్న మోదీకి ఈ చట్టంపై అపోహలు కలిగిస్తున్నారనే కనీస అవగాహన లేదన్నారు. మరింత బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని తెలియదా అన్నారు.