తెలంగాణ

నాణ్యమైన విద్యే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన అమెరికా తెలుగు అసోసియేషన్, ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన విద్యా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20లక్షల ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు యూనివర్శిటీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్లమెంటులో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నూతన విద్యావిదానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో విదేశీ యూనివర్శిటీలు ఏర్పాటు కావడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు , నిధులు నియామకాలు అనే నినాదంతో సాగిందన్నారు. అందులో ఒక్కొక్కటిగా అమలవుతున్నాయన్నారు. భవిష్యత్తు తరాల కోసమే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామనన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో హైదరాబాద్‌లో 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు చర్యలు తీసకుంటామన్నారు. సదస్సులో కాన్సులేట్ హెడ్ ఎరిక్‌అలెక్‌జండర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్ వెంకటరమణ లింబాద్రి, అటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, కాబోయే అధ్యక్షుడు భువనేశ్ భుజాల తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్