తెలంగాణ

29న మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: దివంగత మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఉదయం పదకొండు గంటలకు మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గౌరవ అతిధులుగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల నిర్వాహణ కోసం మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కే. రోశయ్య అధ్యక్షతన ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మర్రి చెన్నారెడ్డిపై కొందరు ప్రముఖులు రాసిన వ్యాసాలు, పంపిన సందేశాలు, పద్యాలను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నట్లు శశిధర్‌రెడ్డి వెల్లడించారు. చెన్నారెడ్డి పేరిట ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న ‘‘చెన్నారెడ్డి నేషనల్ అవార్డు ఫర్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్’ అవార్డును రాష్ట్రంలో వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కోసం నీటి పారుదల నిపుణులు టీ. హనునుంతరావు ఆవిష్కరించిన ‘చతుర్విధ జల ప్రక్రియ’కు గాను ఈ అవార్డులను హనుమంతరావును ఎంపిక చేసినట్లు, ఆయన కుటుంబ సభ్యులకు ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందజేయనున్నట్లు శశిధర్‌రెడ్డి వెల్లడించారు.
పరిపూర్ణ రాజనీతిజ్ఞులు చెన్నారెడ్డి: మాజీ మంత్రి గీతారెడ్డి
మర్రిచెన్నారెడ్డి పరిపూర్ణ రాజనీతిజ్ఞులు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డా.జే.గీతారెడ్డి అన్నారు. విలేఖర్ల సమావేశంలో వారు చెన్నారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ద్విత్వీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది కోసం చెన్నారెడ్డి కృషి చేశారని అన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూనే, కోస్తాంధ్ర వరదల్లో మునిగినపుడు అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకువచ్చిన గొప్ప నేత చెన్నారెడ్డి అని గుర్తుచేశారు. ఆయన క్యాబినెట్‌లో తాము జూనియర్ మంత్రులుగా పనిచేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. అప్పట్లో నక్సల్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు భయపడేవారని, కానీ చెన్నారెడ్డి ఎంతో ధైర్యం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించిన గొప్ప నేత, పరిపాలన దక్షుడని వ్యాఖ్యానించారు. పలు భాషల్లో అనర్గళంగా చెన్నారెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటపుడు సభ ఎంతో వౌనంగా ఉండేదని, సభలో ఉన్న వారంతా చెన్నారెడ్డి ఏం మాట్లాడుతారోనని గమనించేవారని వివరించారు. అంతకు ముందు సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ మంత్రులు పొన్నాలక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, కోందడరాం, మర్రిశశిధర్‌రెడ్డి చెన్నారెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.