తెలంగాణ

ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంఆర్సీ, క్యాబ్ చట్టాల పేరిట భారతదేశ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి, మతోన్మాద చర్యలకు పూనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణితో వంత పాడుతున్నారని విమర్శించారు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా.. ప్రజల జీవన విధానం దెబ్బతింటున్నా..కనీస పట్టింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం రూరల్ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం పెద్దారపు రమేష్ అధ్యక్షతన వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమిత్‌షాల నాయకత్వంలో దేశంలో మతోన్మాద చర్యలను చేపడుతూ 1955లో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు పూనుకున్నారని వాపోయారు. పార్లమెంట్‌లో ఈ నిర్ణయాలను ప్రకటించడం ఆందోళనకరమని అన్నారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి, లౌకికతత్వానికి ఈ చట్ట సవరణ పెనుప్రమాదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నివసించే ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా వ్యవహరించాలే తప్ప వివక్షత పాటించరాదని, అది పాలకుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. రక్షించాల్సిన వారే భక్షించే విధంగా చట్ట సవరణ ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను సైతం సరైన ధరకు అమ్ముకునే స్థితి కల్పించలేకపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై దశలవారీ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రూరల్ జిల్లా కార్యదర్శి చింతమళ్ల రంగయ్య, నాయకులు నమిండ్ల స్వామి, భూక్య సమ్మయ్య, వంగాల రాగసుధ, ఈసంపల్లి బాబు, బుర్రి ఆంజనేయులు, పరికి మధుకర్, మిధున వెంకన్న, హన్మకొండ శ్రీ్ధర్ పాల్గొన్నారు.