తెలంగాణ

హిందూ సమాజం శక్తివంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: హిందూ సమాజం శక్తివంతం కావాలని ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలె శ్యాంకుమార్ పేర్కొన్నారు. నగర శివార్లలోని మంగళపల్లి వద్ద గల భారత్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆరెస్సెస్ తెలంగాణ విజయ సంకల్ప శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరం ఉద్ఘాటన కార్యక్రమంలో శ్యాంకుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో
అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ ముకుందా, క్షేత్ర సహ సంఘ్‌చాలక్ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి, ఇతర క్షేత్ర, ప్రాంత స్థాయి అధికారులు పాల్గొన్నారు. దుర్గుణాలు, దోషాల కారణంగా ఆత్మ విస్మృతి చెందిందని, తనను తాను మర్చిపోయిన విషయాన్ని గుర్తించి హిందూ సమాజాన్ని రక్షిస్తూ, శక్తివంతం చేసే లక్ష్యంతో ఆరెస్సెస్ ప్రారంభమైందని అన్నారు. ఒక విశిష్ట కార్యపద్ధతి ద్వారా తిరిగి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. అహింస విప్లవ పంథాల్లో పనిచేసిన అనంతరం దేశ సామాజిక స్థితిగతులు అధ్యయనం చేసి, హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో గడపడానికి ప్రధాన కారణం హిందూ సమాజ అనైక్యత, ఆత్మ విస్మృతి అని ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ గుర్తించారని అన్నారు. ఇక్కడి మూల సమాజం హిందూ సమాజమని, ప్రతి హిందువు తన రక్తాన్ని ధారపోసి ఈ భూమిని రక్షిస్తూ ఇక్కడి నదులు, పర్వతాలను పవిత్రంగా భావించి, ఈ దేశం ప్రాతినిధ్యం వహించే రంగాల్లో ఎదురయ్యే జయాపజయాలు తనవిగా భావిస్తూ ఇక్కడ వికసించిన సంస్కృతిని హిందూ సంస్కృతిగా, ధర్మాన్ని హిందూ ధర్మంగా, చారిత్రక కట్టడాలను హిందూ వారసత్వ సంపదగా భావించే ప్రతిఒక్కరూ హిందువేనని అన్నారు. ఈ భావనకు వ్యతిరేకంగా ఉన్నవారంతా ఇక్కడివారు కాదని, మతం మారడం వల్ల కూడా ఇక్కడి మూలాల నుండి దూరమవుతారని పేర్కొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ సంఘటిత హిందూ సమాజం నిర్మాణం కోసం నిత్యశాఖ పద్ధతిని ప్రవేశపెట్టారని, ఈ కార్యపద్ధతిని అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో సైతం దైవకార్యంగా భావించడం ద్వారా కార్యకర్తల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. లోక సంపర్కం, సంగ్రాహం, సంస్కారం, నియోజనం, ఈ పద్ధతిలో కార్యవిస్తరణ జరుగుతుందని అన్నారు. దాని కారణంగా జాగృతి హిందూ సమాజాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని, ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామజన్మభూమి ఉద్యమ విజయమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. హిందూ సమాజంలోని సమస్యలు పరిష్కరించడానికి, భేద భావ రహిత సమాజ నిర్మాణం కోసం సంఘ్ శాఖ ఆధారమని, ఈ కార్యాన్ని వ్యాప్తి చేసేందుకు సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయతలతో వ్యవహరించాలని శ్యాంకుమార్ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ శిబిరంలో 8 వేలకు పైగా కార్యకర్తలు తమ స్వంత ఖర్చులతో పాల్గొన్నారని, శిబిరం వ్యవస్థీకృతంగా నడపడానికి వెయ్యి మంది స్వయం సేవకులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని అన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా స్వయం సేవకుల పతసంచలన్ (రూట్ మార్చ్) జరుగుతుంది. అనంతరం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సార్వజనికోత్సవ సభలో ఆరెస్సెస్ పూజ్య సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మాట్లాడతారు.
'చిత్రం... ఇబ్రహీంపట్నంలోని మంగళపల్లిలో ఆర్‌ఎస్‌ఎస్ విజయ సంకల్ప శిబిరాన్ని మంగళవారం నాడు
ప్రారంభిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సహ సర్ కార్యవాహ ముకుందా