తెలంగాణ

ఎన్‌పీఆర్‌నూ ఒప్పుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 24: నేషనల్ పాప్‌లేషన్ రిజిస్ట్రర్ (ఎన్‌పీఆర్)ను సైతం ముస్లీం సమాజం ఓప్పుకోరని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుధ్దీన్ ఓవైసీ తెల్చిచెప్పారు. మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో ఎంఐఎం ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. దేశ ప్రజలను అమిత్‌షా, మోదీలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ సాక్షిగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని చెప్పిన అమిత్‌షా తాము ఎన్‌ఆర్‌సీ గురించే చర్చింలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమిత్‌షా తీసుకురావలన్న ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా హిందుస్తాన్‌లో కోట్లాది మంది ప్రజలు ఆందోళనకు దిగడంతో అమిత్‌షా పేట్లు పీరాయిస్తున్నారని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ కాదు ఎన్‌పీఆర్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఎన్‌పీఆర్ ముసుగులో ఎన్‌ఆర్‌సీని తెచ్చే కుట్ర మోదీ, అమిత్‌షాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అమిత్‌షా అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని ముస్లీంలను ఓవైసీ రెచ్చగొడుతున్నారని చెప్పేమాటలను తాను త్రీవంగా ఖండిస్తున్నానని అన్నారు. తాను రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ప్రజలను చైతన్య పరిచే విధంగా సభలు నిర్వహిస్తున్నానని అన్నారు. అమిత్‌షాకు ఈ వేదిక ద్వారా ఓ సవాల్ చేస్తున్నానని పార్లమెంట్‌లో ఆయన మాట్లాడిన ఎన్‌ఆర్‌సీ మాటపై చర్చిస్తానని ఏ టీవీ చానల్‌లో నిర్ణయిస్తే తాను వస్తానని సవాల్ చేశారు. ఎన్‌ఆర్‌సీ లేదని ఎన్‌పీఆర్ అంటూ కొత్త నాటకం ప్రారంభించారని ఘాటుగా విమర్శించారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ఓటు వేసిందని అందుకు తాను ప్రత్యేకంగా కేసీఆర్‌కు ఈ వేదిక ద్వారా మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
మరోసారి కేసీఆర్‌కు మహబూబ్‌నగర్ నుండి ఈ వేదిక ద్వారా కోరుతున్నానని ముస్లీం తరపున విజ్ఞప్తి చేస్తున్నానని తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ పాప్‌లేషన్ రిజిస్ట్రర్‌ను అమలు చేయోద్దని ఓవైసీ కోరారు. ఈ విషయంపై కేసీఆర్‌తో చర్చిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంతో కూడా చర్చిస్తానని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 18 మంది ముస్లీంలను పోలీసులు కాల్చిచంపారని దేశంలో ముస్లీంలను భయబ్రాంతులకు గురి చేయాలని అమిత్‌షా చూస్తున్నారని భయపడే ప్రసక్తిలేదని ఇప్పటికే ఎన్‌ఆర్‌సీపై సుప్రీంకోర్టులో కేసు వేశానని భారత రాజ్యాంగం చాలా గోప్పదని రాజ్యాంగంపై, కోర్టులపై నమ్మకం ఉందని అన్నారు. దేశంలో ముస్లీంల ఓట్లను తొలగించేందకు కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎన్‌పీఆర్‌ను 2020 ఏప్రిల్ నుండి చేపట్టనున్నారని అదే జరిగితే భారతదేశంలో లక్షలాది మంది ముస్లీంను టార్గెట్‌గా చేసుకుని వారికి నష్టం జరిగించే విధంగా ప్రక్రియ జరగనుందని అన్నారు. ఈ సభలో అలీం అన్సారీ, హాదీ, ఇస్మాయిల్, సనావల్‌ఖాన్, మహ్మాద్ సాబేర్ తదితరులు పాల్గొన్నారు. కాగా మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ఈ సభకు వేలాది మంది ముస్లీంలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు మహబూబ్‌నగర్ పట్టణంలో అడుగడుగున పోలీసు బందోబస్తును నిర్వహించారు.
'చిత్రం... మహబూబ్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు హాజరైన ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ