తెలంగాణ

ఇక అన్నీ హైస్కూళ్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి హైస్కూల్ హెడ్మాస్టర్లనే పర్యవేక్షకులుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం చేస్తున్న యోచనపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ విద్య ప్రవేశపెడుతున్నారని, రెండేళ్లు, మూడేళ్ల పిల్లలు అందులో ఉంటారని, ఇక ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల వయస్సు చాలా తక్కువ ఉంటుందని, వారిని పెద్ద పిల్లలతో కలిపి ఒకే ప్రాంగణంలో ఉంచడం వల్ల, అటు విద్యార్థులకూ, ఇటు టీచర్లకు సైతం సమస్యలు వస్తాయని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి, టీపీటీఎఫ్ నేతలు వై అశోక్ కుమార్, ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు.
పాఠశాల విద్యలో మార్పులు చేయదల్చుకుంటే అందరికీ మంచి చేసే పనుల్లో సహకరిస్తామని, అయితే ముందుగా టీచర్ ఎమ్మెల్సీలతోనూ, సంఘాల నేతలతోనూ చర్చించాలని వారు చెప్పారు. చర్చలు జరగకుండా లీకులు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంటోందని అన్నారు. ఇవి ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. ఒక గ్రామంలోని ప్రాధమిక , ఉన్నత పాఠశాలలను కలిపేసి ఒకటి నుండి పదో తరగతి వరకూ ఒకే యూనిట్‌గా ఉన్నత పాఠశాలలను నిర్వహించాలనే విధానపరమైన కీలక నిర్ణయాన్ని ప్రతిపాదించే ముందు అనుకూల, ప్రతికూల అంశాలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యారంగంలో ప్రధాన భాగస్వామ్యులైన ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. పాఠశాలల మూసివేత ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం బడుల కుదింపుపై శ్రద్ధ చూపుతోందని వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని టీపీటీఎఫ్ నేతలు వై అశోక్ కుమార్, ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. పాఠశాలల పున:ప్రారంభంలోనే హేతుబద్ధీకరణకు ప్రయత్నించాలని, రీ లొకేషన్ అని పేరు మార్చి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది స్కూళ్లను మూసివేసి టీచర్లను సర్దుబాటు చేస్తున్నారని అన్నారు.