తెలంగాణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ టీఆర్‌ఎస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 25: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్‌ఎస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతున్నట్టుగా కనిపిస్తుందని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు మున్సిపల్ వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు అడ్డగోలుగా రూపొందించగా, రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అధికార పార్టీ చెప్పుడు మాటల మేరకు నడుచుకుంటాన్నారని అంతకంటే రాజీనామా చేసి తన గౌరవం కాపాడుకోవాలన్నారు. రిజర్వేషన్లను, ఓటర్ల జాబితాలను అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారన్నారు. ఐనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలోని 50శాతం మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ గెలువబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలంటే హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాదని అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదన్నారు. పట్టణ ఓటర్లలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. దేశ వ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మాయమాటలతో గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక తీర్పు ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో ఆహంకార పెరిగి నియంతృత్వ పాలన సాగిస్తున్నారన్నారు. కొత్త సచివాలయం పేరుతో ఉన్న సచివాలయాన్ని మార్చారని అదెక్కడుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనా తీరుపై ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మెజార్టీ మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని, వారు డబ్బులకు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోనున్నందున ప్రజాతీర్పు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండబోతుందన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ లేదని ఉద్యోగులందరినీ కేసీఆర్ మోసం చేశారని, వారిని బానిసలుగా చూస్తున్నారని, గెజిటెట్ ఆఫీసర్లన్నా గౌరవం లేదన్నారు.
ఉద్యోగులు, నిరుద్యోగులంతా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీనిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.