తెలంగాణ

సూర్యగ్రహణం సందర్భంగా శక్తిపీఠ ఆలయాల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, డిసెంబర్ 25: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు గురువారం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 8.30గంటలకు ఉభయ ఆలయాలు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం ఆలయ శుద్ది, మహాసంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మహామంగళహారతితో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. అలాగే గురువారం అమావాస్య సందర్భంగా నిర్వహించనున్న చండి హోమాలు కూడ రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
కురుమూర్తి ఆలయమూ..
చిన్నచింతకుంట : మండల పరిధిలోని అమ్మాపూర్ సమీపన ఏండుకొండలపై వేలసిన శ్రీ కురుమూర్తిస్వామి ఆలయాన్ని గురువారం సూర్యగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్టుగా ప్రధాన ఆర్చకులు వెంకటేశ్వరచార్యులు తెలిపారు.
ఉదయం నుంచి మధ్యహ్నం వరకూ మూసివేసి ఆ తర్వాత ఆలయ సుద్ధి, సంప్రోక్షణ యథావిధిగా ఆలయం తెరిసి భక్తుల దర్శనార్ధం ఉంచుతామని ఆయన తెలిపారు.
బాసర ఆలయ ద్వార బంధనం
బాసర: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల ద్వారాలను మూసివేశారు.
గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలలో అమ్మవార్లకు గోదావరి జలంతో అభిషేక అర్చన పూజలు నిర్వహించి, సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శన, పూజలను కొనసాగించనున్నట్టు ఆలయ స్థానాచార్యలు ప్రవీణ్ పాఠక్ తెలిపారు.
రాజన్న ఆలయం మూసివేత
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 8.11 నిమిషాలకు స్వామి వారికి పవళింపు సేవ జరిపి మూసివేసారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలను మూసివేసారు. తిరిగి ఉదయం 11.20 నిమిషాలకు సంప్రోక్షణ తరువాత దర్శనాలు యధావిధిగా నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు అప్పాల భీమా శంకర్ తెలిపారు. ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోని ప్రధానాయలంతో పాటు అన్ని ఆలయాలను రాత్రి 7గంటలకు మూసి వేశారు.
సూర్యగ్రహణం కారణంగా బాసర, వేములవాడ ఆలయాలను మూసివేస్తున్న అధికారులు, సిబ్బంది