తెలంగాణ

నేడు టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరుగుతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి సీనియర్ నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరు కావాలని కేటీఆర్ కోరారు. జనవరి నెలలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధానంపై నేతల అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకుంటారు. 130 మున్సిపాలిటీల్లో పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ప్రసంగించనున్నారు. పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టిసారించనున్నారు.