తెలంగాణ

ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ వేర్వేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) , జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)లు వేర్వేరని, ఎన్‌పీఆర్ అనేది ఎన్‌ఆర్‌సీకి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొనడం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచారమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పా రు. ప్రస్తుతం ఎన్‌పీఆర్ 2021లో జరిగే జనగణనలో అంతర్భాగమని.. వాస్తవానికి యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పీఆర్ ప్రక్రియను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. అంతేగాక వాటితో పాటు మరో మూడో నాలుగో అంశాలను అదనంగా జోడించి వివరాలు సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్‌కార్డు నెంబర్, చివరి నివాస స్థలం ఎన్‌పీఆర్‌లో పొందుపరుస్తామని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేట్టు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని, ప్రజల మనస్సులతో ఆటలు ఆడుతున్నాయ ని అన్నారు. దేశంలో సమర్థవంతంగా అమల వుతున్న సంక్షేమ అజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ లాంటి వివిధ పథకాల అమలుకు విఘాతం
కల్గించడం వీరి లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొందించలేదని అన్నారు. కనుక అసత్యాలతో గగ్గోలు పెడుతున్న విపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.
'చిత్రం... * కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి