తెలంగాణ

నేడు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ఎట్ హోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: శీతాకాల విడిది కోసం ఈనెల 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడుకు ఈనెల 23న వెళ్లారు. గురువారం తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట ఆయన భార్య కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుండి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 23న తమిళనాడు వెళ్లిన రాష్టప్రతి పాండిచ్చేరి యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. స్నాతకోత్సవం తర్వాత రాష్ట్రపతి కన్యాకుమారి వెళ్లారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శించారు. వివేకానంద రాక్‌మెమోరియల్ సందర్శనను రాష్ట్రపతి ట్విట్టర్‌లో గురువారం సాయం త్రం పెట్టారు. భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వివేకానంద ప్రపంచదేశాలకు చాటారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సన్యాసి నుండి జగద్గురు స్థాయికి వివేకానంద ఎదిగారని కోవింద్ కితాబిచ్చారు.
ఇప్పటి వరకు దేశంలోని ప్రతిపౌరుడిని వివేకానందుడి ప్రసంగాలు ఉత్తేజితులను చేశాయని, భవిష్యత్తులో కూడా యువతకు వివేకానందుడు ఆదర్శంగా నిలుస్తారని రాష్టప్రతి అభిప్రాయపడ్డారు. వివేకానంద రాక్ మెమోరియల్ 1970 సెప్టెంబర్ 2న ఆనాటి రాష్ట్రపతి వి.వి. గిరి ప్రారంభించారని గుర్తు చేశారు. గత 50 ఏళ్ల నుండి కూడా వివేకానంద రాక్ మెమోరియల్‌ను లెక్కలేనంత మంది సందర్శించారని గుర్తు చేశారు. భారతదేశం గురించి ఎవరైనా చెబితే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటూ చెబుతారని రాష్టప్రతి పేర్కొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్ హోం’ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన వారిని మాత్రమే ఎట్‌హోం కు ఆహ్వానించారు. ఈ నెల 28 న రామ్‌నాథ్ కోవింద్ తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.
'చిత్రం...హైదరాబాద్ తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న గవర్నర్ తమిళిసై