తెలంగాణ

కాంగ్రెస్ ర్యాలీకి నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: కాంగ్రె స్ తలపెట్టిన ర్యాలీతో సహా ఎటువంటి ప్రదర్శనలకు ఈనెల 28వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లో అనుమతించే ప్రసక్తిలేదని, పోలీసు శాఖ ప్రకటించడం, ర్యాలీ నిర్వహించి తీరుతామని పీసీసీ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రం అమలు చేస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈనెల 28వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ 28 తేదీన ర్యాలీ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గాంధీభవన్‌కు శుక్రవారం చేరుకోవాలని ఆయన పిలుపున్చిరు. 28వ తేదీన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారత్‌ను కాపాడం డి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే ర్యాలీకి పోలీసులు
అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులు తమ దరఖాస్తును పరిశీలించలేదన్నారు. ప్రజల జీవితాలతో టీఆర్‌ఎస్ చెలగాటమాడుతోందన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్నామన్నారు. బీజేపీకి మొదటి నుంచి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. నోట్ల రద్దు సందర్భంగా అందరి కంటే ముందే మద్దతు ఇచ్చామన్నారు. మోదీని విమర్శించవద్దని విచిత్ర వాదన చేశారన్నారు. జీఎస్‌టీ పన్నుకు, రాష్టప్రతి ఎన్నికల్లో కోవింద్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మీరాకుమారికి మద్దతు ఇవ్వాలని అడిగితే, రాష్టప్రతి కోవింద్‌కు, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ కంటే ఎక్కువగా మోదీని టీఆర్‌ఎస్ ప్రశంసించిందన్నారు. జాతీయ పౌర పట్టిక విషయమై కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు. అవకాశవాద రాజకీయాలను ఎదురించే పోరాడుతామన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ క్రైస్తవులను దగా చేస్తున్నారన్నారు. ఇంతవరకు క్రైస్తవ భవన్‌ను నిర్మించలేదన్నారు. మిషనరీ భూముల పరిరక్షణకు ఒక చట్టం తేవాలన్నారు.
'చిత్రం... హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి