తెలంగాణ

హైదరాబాద్‌లో తగ్గిన నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: హైదరాబాద్ నగరంలో 2018 తో పోలిస్తే ఈ ఏడాది మూడు శాతం నేరాలు తగ్గాయని పోలీ స్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్, హోంగార్డు స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయడంతో హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్గాయని, పండుగలు, ఉత్సవా లు శాంతియుత వాతావరణం లో విజయవంతంగా జరిగాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. కొఠీలోని ఓయూ మహి ళా కళాశాల ఆవరణలో గరువారం జరిగిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ 2019లో తగ్గిన క్రైంరేటు వివరాలు, పోలీసులు శాంతిభద్రతను కాపాడటంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు. అస్తినేరాలు 2, చైన్‌స్నాచింగ్‌లు 30 శాతం, మహిళలపై హత్యాచారాలు 16, శారీరక నేరాలు 9, మర్డర్ కేసులు 3, కిడ్నాప్ కేసు లు 14 శాతం తగ్గాయని తెలిపారు. అదే విధంగా గత సంవత్సరంతో
పోల్చి చూస్తే వరకట్న చావు కేసులు 11, వాహనాల దొంగతనాలు 17 శాతం పెరిగాయని వెల్లడించారు. ఈ ఏడాదిలో మొత్తానికి 3 శాతం నేరాల రేటు తగ్గిందని, ఐపీసీ కేసులు 15,598 నమోదు చేశామని తెలిపారు. అస్తి కేసులకు సంబంధించి 2018లో 2524 కేసులు నమోదు కాగా, 2019లో 2474కు చేరుకుని రెండు శాతం తగ్గింది. హైదబాద్ నగరంలో 2018లో 78 హత్యలు నమోదు కాగా, 2019లో 76 హత్యలు చోటుచేసుకున్నాయి. చైన్‌స్నాచింగ్‌లు 2018లో 20 జరుగగా అది క్రమంగా తగ్గి 2019లో 14 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వరకట్నం కేసులు 11 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయని సీపీ వెల్లడించారు. వరకట్న కేసులకు సంబంధించి 2018లో 17 మంది మృతి చెందగా, 2019లో 19మంది మృతి చెందారు. హైదరాబాద్ పరిధిలో అత్యాచార కేసులు తగ్గాయని, మహిళలపై అత్యాచారాలు 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. 2018లో 134 మంది కిడ్నాప్ కాగా, 2019లో 115 మంది కిడ్నాప్ కేసులు నమోదైనట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందని వెల్లడించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు 27,737 కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో కోర్టు ద్వారా రూ. 8.32కోట్లు వసూళ్లు అయినట్టు సీపీ పేర్కొన్నారు. 2019లో సిటీలో రోడ్డు ప్రమాదాలు 2,377 నమోదైతే, 261 మంది మరణించారని, ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో 135 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు, మూడు లక్షల 40 వేల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అంజనీ కుమార్ తెలిపారు. షీ టీమ్, భరోసా కేంద్రాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని నగర కోత్వాల్ తెలిపారు. దొంగతనం వంటి ఇతర కేసులను టాస్క్ ఫోర్స్, క్రైమ్, సీట్ అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషితో అతి తక్కువ కాలంలో ఛేదించామన్నారు. నగర పోలీసు విభాగంలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కార్డన్‌సెర్చ్‌లు, అపరేషన్ చబుత్ర వంటి అనేక కార్యక్రమాల ద్వారా నేరాలను కొంత వరకు అదుపు చేయగలిగామన్నారు. హైదరాబాద్ పోలీస్‌కు బెస్ట్ క్వాలిటీలో దేశంలోనే మొదటి స్థానం దక్కుతుందన్నారు. హైదరాబాద్ వ్యాపార, పర్యటక, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు దారులు కూడా హైదరాబాద్‌లో తమ వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు అసక్తి కనపరుస్తున్నారని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక స్థానం లభించిందని, ఇది కేవలం శాంతి భద్రతలతోనే సాధ్యమైందని చెపాపరు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో పాస్ పోర్టు విచారణ వంద శాతం పూర్తి చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సీపీ ఈ సందర్భంగా అభినందించారు. నేర పరిశోధన విభాగం అధ్వర్యంలో ఇప్పటి వరకు 1400 కేసులు నమోదు చేసి అనేక మందిని జైలుకు పంపామన్నారు. ఈ సంఖ్య ఈనెల చివరినాటికి పెరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్టేషన్‌లలో 2020లో సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని, అందుకు తగ్గట్టుగా సిటీ పోలీసులకు శిక్షణనివ్వడం జరుగుతుందని సీపీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో పాన్‌షాపులుంటే, ఈ విషయంలో స్థానికులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు నగరంలోని పోలీసు అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో నగర అదనపు సీపీలు షీకాగోయల్, డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీలు తరుణ్‌జోషి, అవినాష్ మహంతి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్