తెలంగాణ

ఓటు బ్యాంక్ రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తగదని జై స్వరాజ్ పార్టీ, జన వాహిని పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. ‘లౌకితత్వమా? ఓటు బ్యాంక్ రాజకీయమా?’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సీఏఏను విమర్శించడం అర్థరహితమని వక్తలు అభిప్రాయపడ్డారు. జన వాహిని అధ్యక్షుడు డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ బాబు మాట్లాడుతూ సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదని, అయితే, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ అంశంపై లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నాయని అన్నారు. ఇలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లో అక్కడ మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హత్యలు, అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యాలయ్యాయని అన్నారు. అందుకే, అక్కడ బతకలేక దేశానికి వచ్చిన ఈ వర్గాల వారికి పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంలో తప్పులేదని అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాలని హితవు పలికారు. జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస రావు మాట్లాడుతూ సీఏఏను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. దేశంలో ఉంటున్న ముస్లింలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించని ఈ చట్టంపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన ప్రముఖ విశే్లషకుడు హెబ్బార్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా భారత దేశాన్ని మించిన లౌకిక దేశం లేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానికి ముందు, ఆతర్వాత కూడా భారత్ అన్ని మతాలను ఆదరిస్తూ వస్తున్నదని, మత విద్వేషాలను ఎప్పుడు రగల్చలేదని అన్నారు. రాజ్యంగ పీఠికలో లౌకికవాదం అనే పదం 42వ రాజ్యాంగ సవరణలో వచ్చి చేరిన విషయాన్ని గుర్తుచేశారు. పరమత భేదం లేని భారత సమాజానికి లౌకికవాదం అనే ముద్ర అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే అల్లర్లు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త మారోజు రమాదేవి మాట్లాడుతూ సీఏఏ వల్ల దేశంలో ఉన్న ముస్లింల హక్కులకు ఎలా భంగం వాటిల్లుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ వర్గాలపై దాడులు జరగడం సీఏఏపై ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలకు, సంఘాలకు తెలియదా అని నిలదీశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో బతకలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ ఎవరైనా ముస్లింలు ఆయా దేశాలను వదలి వలస వెళితే, ఇతర ఇస్లామిక్ దేశాలు ఎందుకు రానియ్యడం లేదని ప్రశ్నించారు. దేశంలోని ముస్లింలకు సీఏఏ ఏ మాత్రం వ్యతిరేకం కాదని, వారి హక్కులను హరించేది కాదని స్పష్టం చేశారు. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఉద్దేశపూర్వకంగానే ముస్లింలను రెచ్చగొట్టి, స్వలాభం పొందే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సహాయ పునరావాస కేంద్రం ప్రతినిధి లావణ్య రెడ్డి మాట్లాడుతూ, సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిలో దేశ భక్తి ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై ఏమాత్రం అవగాహన లేని వారే విమర్శలకు, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. నిజానికి దీనిని వ్యతిరేకిస్తూ, నిరసనలకు పూనుకుంటున్న వారిలో అత్యధిక శాతం మందికి ఆ చట్టంలో ఏముందో కూడా తెలియదని అన్నారు. సీఏఏను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.