తెలంగాణ

ప్రాచీన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, డిసెంబర్ 28: ప్రాచీన వైద్యవిధానం పై రోజురోజుకి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికిందరాబాద్ పద్మారావునగర్‌లో శనివారం జరిగిన మెనో-త్సి-ఖాంగో టిబెటిన్ ప్రజా ఆరోగ్య సేవాకేంద్రం పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. దలైలామ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిబెటిన్ మెడికల్ అండ్ ఆస్ట్రోలాజికల్ సంస్థ 103వ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడంతో ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో తయారు చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్సలు అందజేస్తూ, మొండి, దీర్ఘకాలిక రోగాలను కూడా టిబెటిన్ వైద్య విధానం నయం చేస్తోందని, ఇది అత్యంత ప్రాచీనమైందని, అందుకే ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరారు. కాలుష్యానికి దూరంగా, ఎలాంటి రోగాలకు తావులేని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పర్వత ప్రాంతమైన టిబెట్‌లో కాలుష్యానికి దూరంగా, చక్కటి జీవన విధానంతో అక్కడ ప్రజలు నివసిస్తున్నారని వివరించారు. అంతేగాక, వారు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ, ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. పాశ్చాత్య ప్రభావంలో పడి, రసాయనాలతో తయారైన ట్యాబ్లెట్లను వాడేందుకు అలవాటు పడిన, ఎంతో గొప్పదైనా భారతీయ ప్రాచీన వైద్య విధానాన్ని విస్మరిస్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం కూడా టిబెట్ నుంచి దలైలామాకు 1961లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆశ్రయమిచ్చి, సాంప్రదాయకమైన వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తుందని, అలాగే వైద్య శాఖలోని ఆయుష్ విభాగం కూడా ఇలాంటి వనమూలికలతో తయారయ్యే వైద్యాన్ని చేర్చాలని నిర్ణయించటం వాటిని ప్రోత్సహించేందుకేనని వివరించారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, బన్సీలాల్‌పేట కార్పొరేటర్ కే.హేమలత, సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమా, మెడికల్ సెంటర్ కో ఆర్డినేటర్లు రామచంద్రరాజు, రామకృష్ణరాజు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, ఎడ్ల హరిబాబు యాదవ్, కరాటే రాజు, కమల్‌కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు దేవేందర్, అంజయ్య, కుశాల్ పాల్గొన్నారు.