తెలంగాణ

ఇంటర్ పరీక్షలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల నిర్వహణకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చే ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలకు, మార్చి 4వ తేదీ నుండి థియిరీ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షలకు 9.65 లక్షల మంది ఫీజులు చెల్లించారని, ఈ సంఖ్య మొత్తం విద్యార్ధులతో పోల్చుకుంటే 97.93 శాతం ఉందని ఆయన చెప్పారు. ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలకు 1517 కేంద్రాలు ఏర్పాటు చేసిందని, మరో 449 కేంద్రాలను వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధం చేశామని, థియిరీ పరీక్షలకు 1317 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.