తెలంగాణ

విద్యుత్ శాఖలో అవినీతి ఊట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యుత్ శాఖలో రెండు లక్షలు వేతనం తీసుకుంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయ అధికారులే లంచాలకు పాల్పడడం సిగ్గుచేటని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పై అధికారులే లంచాలకు పాల్పడితే దిగువస్థాయి అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా మందలిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ శాఖ ఓసీ ఉద్యోగుల అసోషియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీఈ స్థాయి అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోవడం అవమానంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలతో తల దించుకునే పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు. ఉద్యోగులు సేవలు మర్చిపోయి, లంచాలతో వినియోగదారులను వేధించవద్దన్నారు. విద్యుత్ శాఖలో అవినీతి పెరిగిపోతే ఆర్టీసీకి వచ్చిన నష్టాల గతే తమ సంస్థకు పడుతుందని ఆయన ఉద్వేగంతో అన్నారు. అధికారులు మేల్కొనకపోతే ఆర్టీసీకి పట్టిన గతే విద్యుత్ సంస్థలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం లంచాలు తీసుకుంటే ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగి కుటుంబం కూడా అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు రెండుమార్లు వేతన సవరణ చేయడంతో 38 శాతం జీతాలు పెరిగాయన్నారు. ఒకవైపు పెరిగిన జీతాలు తీసుకంటూ మరోవైపు లంచాలు తీసుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు. కాంట్రాక్టు, ఆర్టిజన్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో విద్యుత్ సంస్థలపై అధిక భారం పడుతోందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘటనలను ఆయన ఉపకరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం 26వేల కోట్ల ఖర్చు చేయడానకి వివిధ ప్రణాళికలతో పనులను వేగవంతం చేస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల్లో విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టడానికి ట్రాన్సికో, జె న్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృషిని ఆయన కొనియాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సంయమనం పాటించడం లేదన్నారు. వినియోగదారులపై విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఉన్నపళంగా విద్యుత్ సరఫరాను బంద్ చేయవద్దన్నారు. విద్యుత్ బంద్ చేయడంతో మళ్లీ సరఫరాను పునరుద్ధరించడానికి సమయం పడతుందని దీంతో సమయం వృథా అవుతుందే తప్పా వినియోగదారున్ని సంతృప్తి పర్చలేమన్నారు. వినియోగదారులపై అధికారులు దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ఆర్థిక పరంగా విద్యుత్ సంస్థలు నిలబడలేకపోతే సంస్థ అథోగతి పాలౌతుందన్నారు. అవినీతి రహిత సేవను అలవాటు చేసుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.