తెలంగాణ

రూ. 3,500 కోట్లతో దుమ్ముగూడెం వద్ద బ్యారేజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 3,500కోట్ల రూపాయలతో బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం పినపాక నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా లబ్ధి జరగనున్నదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మారుమూల ప్రాంత రైతుల భూములకు కూడా సమృద్ధిగా నీరందుతుందన్నారు. దుమ్ముగూడెం వద్ద బ్యారేజి నిర్మిస్తే ఎప్పుడూ 40టీఎంసీల నీరు నిల్వ ఉండేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పినపాక నియోజకవర్గం సింగిరెడ్డిపాలెంలో 19కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మరో 5ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు నేరుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రం కేంద్ర బిందువుగా ఈ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల ప్రజలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 300కోట్ల రూపాయలతో 3ఫేజ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన జనవరి మాసంలో పంపుహౌజ్‌ల ట్రయల్న్ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రైతులకు పుష్కలంగా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, ఎంపీ కవిత తదితరులు ఉన్నారు.
'చిత్రం...సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ