తెలంగాణ

రాష్ట్రంలో కుంటుపడిన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర సచివాలయాన్ని బీఆర్కే భవన్‌కు మార్చిన తర్వాత పాలన మరింత కుంటుపడిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. బీఆర్కే భవన్‌లో సచివాలయ కార్యాయాలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఇటీవల వాటర్‌వర్క్సు బోర్డు కార్యలయం నుండి ఒక లేఖను సచివాలయానికి పంపితే ‘ ఎడ్రస్ నాట్ ట్రేస్డ్ ’ పేరుతో వెనక్కు వచ్చిందని ప్రభాకర్ చెప్పారు. అంటే చివరికి పోస్టల్ శాఖ సైతం చిరునామాలను గుర్తించలేకపోతోందని వ్యాఖ్యానించారు. దీనివల్ల సామాన్యుల ఈతిబాధలు ఇన్నీ అన్నీ కావని అన్నారు. పనిలేని, పనికిరాని మంత్రులు ఎక్కువగా ఉన్నారని, రిటైరైన అధికారులను ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పదవుల్లో నియమించారని, అయినా ప్రజాసమస్యల పరిష్కారం జరగడం లేదని అన్నారు. సీఏఏను, ఎన్‌ఆర్‌సీని, ఎన్‌పీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో విపక్షాలకు స్పష్టత లేదని ప్రభాకర్ విమర్శించారు. ఎంఐఎంను సంతుష్టీకరించేందుకే టీఆర్‌ఎస్ ఎత్తుగడ మాత్రమేనని అన్నారు. సీఎం రాష్ట్రంలో సకల జనుల సర్వే నిర్వహించినపుడు లేని అభ్యంతరాలు నేడు ఎన్‌పీఆర్‌కు ఎందుకని నిలదీశారు.

'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్