తెలంగాణ

గ్రామాల అభివృద్ధిలో స్థానికులు భాగస్వాములవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 31: గ్రామాల్లో జరిగే పనుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేయాలని, గ్రామాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సబ్ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యధిక మార్కులు ఇవ్వాలని, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డిని విధిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పించాలని, అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసే కార్యక్రమంల ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని ఉపయోగించుకుని గ్రామంలో చెత్తా చెదారం లేకుండా చూడాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చెత్తా చెదారంతో దోమలు వ్యాధులు, డెంగీ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించే దిశగా స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని అన్నారు. రెండో విడత పల్లె ప్రగతిని ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. రెండో విడత ఆరోగ్య పరీక్షలు కూడా ప్రజలకు నిర్వహించాలని, గ్రామాలకు అవసరమున్న పనులు గుర్తించి వాటిని పూర్తి చేయాలని, గ్రామాల్లో నర్సరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే శ్మశాన వాటికల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టాలని, ప్రభుత్వం అభివృద్ది పనుల కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో బెన్ శాలోమ్, ప్రత్యేక అధికారి రాజర్షి షా, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
'చిత్రం... హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం రెండో విడత పల్లె ప్రగతిపై జరిగిన
సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్