తెలంగాణ

పుర పోరులో.. గులాబీ గెలుపు లాంఛనమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 31: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 18 మున్సిపాల్టీల్లో గులాబీ విజయ పతాకం ఎగరడం ఖాయమని, సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజల్లో నెలకొన్న ఆదరణ పార్టీకి ఘన విజయం అందించనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ నల్లగొండ మున్సిపాల్టీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతు ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్ గెలుపు, విపక్షాలకు ఓటమి తధ్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు బండకేసి కొడుతారన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికలో ప్రజలు సీఎం కేసీఆర్ పక్షాన నిలిచి ప్రతిపక్షాలను ఎలాగైతే ఓడించారో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరుగనుందన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పగటి కలలతో ప్రగల్భాలు పలకగా చివరకు బొక్క బోర్డ పడ్డాడన్నారు. కాంగ్రెస్ వృద్ధ జంబుకాలకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోర్టుకు పోతామంటు ముందే ఓటమిని అంగీకరించి పలాయనం చిత్తగించాడన్నారు. మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్ గెలిచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ అంశాన్ని, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కేడర్ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయం సాధించాలన్నారు. అతి విశ్వాసం పనికిరాదని, ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో పనిచేసి అన్ని వార్డుల్లో ఓటర్లను ఆకర్షించి గెలుపు సాధనకు కృషి చేయాలన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో అన్ని మున్సిపాల్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ చివరి భూములకు నీళ్లిచ్చిన చరిత్ర టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. 40ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటుకాగా, దండుమల్కాపూర్ ఇండస్ట్రీయల్‌పార్కు, యాదాద్రి థర్మల్ ఫ్లాంట్, యదాద్రి ఆలయ అభివృద్ధి వంటి పనులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందడుగు వేస్తుందన్నారు. మున్సిపల్ ప్రజలు చైతన్యవంతంతో వ్యవహరించి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లను గెలిపించి మున్సిపల్ వార్డుల అభివృద్ధికి అవకాశమివ్వాలన్నారు. ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి గెలిచే అభ్యర్థులకు టికెట్లు దక్కుతాయన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్, వేమిరెడ్డి నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, బోయపల్లి కృష్ణారెడ్డి, సుంకరి మల్లేశం, కటికం సత్తయ్యగౌడ్, అబ్బగోని రమేష్ పాల్గొన్నారు.
'చిత్రం... పుర పోరుకు బాణం సంధిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి