తెలంగాణ

నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి-2 కార్యక్రమం సందర్భంగా 18 సంవత్సరాలు పైబడి వయసు ఉండి చదవడం, రాయడం రాని నిరక్షరాస్యుల జాబితాను
సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్లతో బుధవారం బీఆర్కే భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేసి ఈ నెల 10లోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. అక్షరాస్యత పెంచేందుకు ‘ఈచ్ వన్-టీచ్ వన్’ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఇచ్చిన పిలుపును దృష్టిలో ఉంచుకుని సోమేష్ కుమార్ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరక్షరాస్యుల వివరాలను సేకరించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెనె్సస్ డైరెక్టర్ ఇలంబర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్