తెలంగాణ

మూడేళ్లలో 240కోట్ల మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 18: రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 240కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలో ఒకేరోజు రెండు లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజునే 9 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. మొక్కలు తక్కువగా ఉన్న జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ ద్వారా తెప్పించి పంపిణీ చేయనున్నామన్నారు. ప్రజలు తమకు అవసరమైన, ఇష్టమైన పండ్లు, పూల మొక్కలను వేసుకునేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 85లక్షల మొక్కలు నాటామన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజల అభిరుచులకు అనుగుణంగా మొక్కల పంపిణీ జరుగుతోందని రామన్న వివరించారు.

చిత్రం.. మొక్క నాటుతున్న మంత్రులు జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు