తెలంగాణ

టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ కిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్) మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ ఎన్ కిషన్ నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ గణితశాస్త్ర సీనియర్ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్న కిషన్ గత ఏడాది టీఎస్ సీపీజెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీజెట్‌ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరుతెచ్చుకున్నారు. సుమారు 66 కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మాద్యమాల్లో నిర్వహించిన సీపీజెట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రవేశపరీక్షగా చెప్పవచ్చు. కిషన్ కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీవీ రమణ సైతం కొనియాడారు. ఈ క్రమంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు మెంబర్ సెక్రటరీగా ఆయనను నియమించారు. వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించగా, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు ఆయనను సత్కరించారు.