తెలంగాణ

మంచి పనులు నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: వర్కింగ్ జర్నలిస్టులు తమ డైరీలోని ప్రతిపేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు, విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియా డైరీని గవర్నర్ ఆవిష్కరించారు. డైరీలో ప్రచురించిన సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షుడు కే. శ్రీనివాసరెడ్డి, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజే అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ. పీసీఐ సభ్యుడు ఎంఏ మాజిద్, ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, సీసీఐ మాజీ సభ్యులు కె. అమర్‌నాథ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యు ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, కోశాధాకారి కె మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రాజేష్, యాదగరి, అయిలు రమేష్, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శివశంకర్ గౌడ్ పాల్గొన్నారు. డైరీ ఆవిష్కరణలో గవర్నర్ భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు.
'చిత్రం... తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో రూపొందించిన మీడియా డైరీని బుధవారం ఆవిష్కరిస్తున్న గవర్నర్ తమిళి సై