తెలంగాణ

మళ్లీ సొంత గూటికి రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గతంలో కాంగ్రెస్‌లో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం పలువురు పార్టీ మాజీ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్సేనన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు. రాజకీయాలను సీఎం కేసీఆర్ బ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌వి దిగజారుడు రాజకీయాలని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సూటీగా ప్రశ్నిస్తున్నా, నిరుద్యోగ భృతి, రుణ మాఫీ ఏమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని ఎండగడుతామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందంటూ టీఆర్‌ఎస్ నాయకులు చౌవకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఆరు సార్లు గెలిచిన తాను మున్సిపల్ ఎన్నికలకు భయపడుతానా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ ఆర్‌సి కుంతియా నియమించారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి చైర్మన్‌గా 10 మంది సభ్యులతో కమిటీని నియమించినట్టు కుంతియా తెలిపారు.
'చిత్రం... గాంధీభవన్‌లో బుధవారం మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి