తెలంగాణ

కఠినంగా ఉండాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ‘మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా... ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అదేమి తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు’ అని అన్నారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. సమ సమాజ నిర్మాణ క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. రిటైర్డు డీజీపీ హెచ్‌జె దొర తన ఆటోబయోగ్రఫీపై రచించిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ‘ దురదృష్ట వశాత్తూ సమాజంలో నేర ప్రవత్తి పెరుగుతుంది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీని కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన పాఠ్యాంశాలు తయారు చేయాలి. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం. జీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైర భాగస్వామ్యం అందించాలి’ అని పిలుపునిచ్చారు. ‘డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు గుడుంబా నిర్మూలనతో పాటు పేకాట క్లబ్బుల మూసివేతలో, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో, హరితహారంలో చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇదే విధంగా
తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘హెచ్‌జె దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్ వర్క్‌తో ఎలా విజయాలు సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థవంతంగా పని చేయవచ్చో తన అనుభవాలను ఈ పుస్తకంలో పేర్కొన్నారు. వీటిని పోలీసు అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. పుస్తక రచయిత హెచ్‌జే దొర మాట్లాడుతూ, పోలీసులు ఎప్పుడూ తాము హెల్ప్‌లెస్ అనే భావనకు గురికావద్దన్నారు. ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్ స్కూల్స్, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపదగా మిగులుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్‌రావు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆచార్య ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు, రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... రిటైర్డు డీజీపీ హెచ్‌జే దొర రచించిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్