తెలంగాణ

21నుంచి కెయు పిజి సెట్ వెబ్ ఆప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసముద్రం (వరంగల్), జూలై 18: కాకతీయ యూనివర్శిటి, శాతవాహన యూనివర్శిటీ పిజి కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఈనెల 21 నుండి ప్రారంభమవుతాయని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ వెంకయ్య తెలిపారు. ఎంఎస్‌సి మ్యాథ్స్ జూలై 21 నుండి 23 వరకు, ఎంసిజె బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మైక్రోబయోలజీ, జువాలజీ, ఎంఏ సోషయాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటిఎం, ఎన్‌హెచ్ ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్‌ఇ, పిజి సెరీకల్చర్ డిప్లొమా విద్యార్థులు 24 నుండి 26 వరకు, ఎంకామ్ విద్యార్థులు జూలై 27 నుండి 30 వరకు, ఎంఎస్‌సి కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు, ఎంఎస్‌సి జువాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎంఇడి ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులు ఆగస్టు 1 నుండి 3 వరకు, ఎంఎస్‌డబ్ల్యు, ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ స్టడీస్, ఎంఎస్‌సి బాటనీ, ఎంపిఇడి కోర్సులకు ఆగస్టు 3 నుండి 5 వరకు వెబ్ ఆప్షన్లు చేసుకోవాలని కోరారు. కెయు పిజి సెట్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ కళాశాల కోర్సులను ఎంపిక చేసుకోవాలని వివరించారు. సర్ట్ఫికేషన్ వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో లాగ్ ఇన్ కావాలన్నారు. లాగ్ ఇన్ అయిన అనంతరం వారి సెల్‌కు వన్ టైం పాస్‌వర్డ్ నంబర్ వస్తుందనీ, తరువాత విద్యార్థులు తమ పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. తద్వారా జిల్లాలను ఎంపిక చేసుకోవాలని, దాంతో ఆయా జిల్లాల్లోని కళాశాలల జాబితా చూపుతామని, విద్యార్థులు ప్రాధాన్యం ప్రకారం నంబర్లు ఇచ్చి ఎంపిక చేసుకోవాలని తెలిపారు. కళాశాల ప్రాధాన్యతలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. ఎంపిక పూర్తయిన అనంతరం కోర్సుల జాబితాను ప్రింట్ తీసుకోవచ్చని అన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అడ్మిషన్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి