తెలంగాణ

పనులు చేయని సర్పంచ్‌లు ఇంటికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పనులు చేయకపోతే సర్పంచ్‌లు ఇంటికి వెళ్ళాల్సిందేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల గ్రామంలో గురువారం ప్రారంభించిన ఆయన గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ 500 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనాల్సిందేనని, వీటిని సొంత పనులకు వాడితే తక్షణమే చర్యలు తీసుకుంటామని, నిర్దేశించిన పనుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా సర్పంచ్‌లపై వేటు తప్పదని స్పష్టం చేశారు.