తెలంగాణ

సంక్షేమ పథకాల అమలులో అధికారులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం 2020 డైరీ, క్యాలెండర్‌ను గురువారం ప్రగతివన్‌లో సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతున్న ఈ సమయంలో అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. విధులను కేవలం వృత్తిపరంగానే కాకుండా సామాజిక సేవా కోణంలో పనిచేయాలని సీఏం సూచించారు. టీజీఓ ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శిస్తూ క్యాలెండర్‌ను వెలువరించడంపై ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ ప్రజల కోసం, సంక్షేమం కోసం పని చేస్తామని టీజీవో ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...టీజీవోఏ కేంద్ర సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్