తెలంగాణ

తెలంగాణలో మహిళా యూనివర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని సావిత్రిబాయ్ పేరిట ఏర్పాటు చేయాలని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ గురువారం నాడు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్మన్ నాగటి నారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవిత విశేషాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఆవశ్యకతను వివరించారు. సెక్రటరీ పగడాల లక్ష్మయ్య ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచారు. ఎంవీఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆశాలత, విద్యావేత్త ఎల్‌బీ రెడ్డి, పీడీఎస్‌యూ కార్యదర్శి రాము, కేవీపీఎస్ కార్యదర్శి స్కైలాబ్, పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అజయ్ బాబు తదితరులు మాట్లాడారు. సమావేశంలో ఈ సందర్భంగా ఒక తీర్మానాన్ని చేశారు. ఆదర్శమూర్తి సావిత్రిబాయి పూలే ఆధునిక భారత దేశ తొలి మహిళా టీచర్‌గా బాలికల విద్యాభివృద్ధికి బహుజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, జనవరి 3న ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధిపై చర్చించడం జరిగిందని వక్తలు పేర్కొన్నారు. పూనేలో సావిత్రిబాయి పూలే యూనివర్శిటీని 1949లోనే ఏర్పాటు చేశారని, ఆ మహానీయురాలి స్ఫూర్తితో మహిళల విద్యాభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మహిళా యూనివర్శిటీ లేకుండా పోయిందని, ఉన్నత విద్యలో రాష్ట్ర మహిళల స్థూల నమోదు నిష్పత్తి 36.5గా ఉందని, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల నమోదు మాత్రం 25 శాతంలోపే ఉందని అన్నారు. అందువల్ల మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్నత యూనివర్శిటీని ఏర్పాటు చేస్తే విద్యావకాశాలు పెరుగుతాయని వారు చెప్పారు.
ఈ సందర్భంగా వారు సావిత్రిబాయి గురించి కొనియాడుతూ పాత సచివాలయంలో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
'చిత్రం...రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ నేత