తెలంగాణ

అన్నీ గెలవాలె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ‘మున్సిపల్ ఎన్నికల్లో మనదే విజయం. 100 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లు పక్కాగా మనవే. సర్వేలన్నీ మనకే అనుకూలంగా వచ్చాయి. పరిస్థితి బాగున్నప్పటికీ ఎక్కడైనా తేడా వచ్చిందో ఉన్న పదవులు ఊడుతాయి తస్మాత్ జాగ్రత్త’ అని పార్టీ నేతలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. అతి విశ్వాసం కానీ, అంతా పార్టీ చూసుకుంటుందన్న నిర్లక్ష్యం కానీ చేస్తే సహించేది లేదన్నారు. అభ్యర్థి ఒక్కసారి ఖరారయ్యాక గెలిపించడం కానీ, బుజ్జగింపులు కానీ ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులను సమన్వయం చేసుకోవడం, వారితో ఆత్మీయ సమావేశా లు నిర్వహించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. త్వరలోనే జరుగనున్న మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేత లు, ప్రజా ప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశా నిర్దే శం చేశారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో మనకు ఎవరితోనూ పోటీ లేదు. మనకు మనమే పోటీ. బీజేపీనో, కాంగ్రెస్‌నో గట్టి పోటీ ఇస్తుందన్న భ్రమలు కానీ, అపోహలు కానీ ఇంకా ఎవరికైనా ఉంటే వదిలేయం డి’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, బీజేపీ నాయకులేమో తమకేదో బలం ఉన్నట్టు బిల్డప్‌లు ఇస్తారని, వారి మాయలో పడవద్దని కేసీఆర్ హెచ్చరించినట్టు తెలిసింది. వాస్తవానికి మనకు మనం పోటీ తప్ప ఎవరికీ మన్నూ మశానం అంటూ ఏదీ లేదని కేసీఆర్ ఎద్దేవా చేసినట్టు తెలిసింది. అభ్యర్థి ఎంపిక తర్వాత ఎక్కడైనా రెబల్స్ సమస్య వస్తే
పరిష్కరించే బాధ్యత మొదట ఎమ్మెల్యేదే, ఆయనతో కాకపోతే ఆ జిల్లా మంత్రిదేనని స్పష్టం చేసినట్టు సమాచారం. వీరి ఇద్దరి మధ్యలో పడి ఎక్కడైనా తేడా వచ్చిదంటే ఉన్న పదవులు ఊడుతాయి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారని తెలిసింది. అభ్యర్థి ఎవరన్నది స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నేతలతో పాటు పార్టీ తెప్పించుకున్న సర్వేను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామన్నారు. ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించాక నేతలంతా కలిసికట్టుగా కృషి చేసి గెలిపించి తీరాల్సిందేనని, ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదని హెచ్చరించరించినట్టు సమాచారం. గ్రూపు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలపై కూడా అధినేత కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకులతో చర్చించి ఖరారు చేసుకోవాలని సూచిస్తూ, అవసరమైనచోట మంత్రులు కూడా ప్రచారానికి వస్తారని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.
బాబు మోహన్ ప్రస్తావన!
సమావేశంలో అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీలో ఉన్న అతనిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇస్తే ఆయన ఎవరినీ కలుపుకొని వెళ్లలేదని, ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేదని, అందర్నీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని గుర్తు చేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇస్తే చక్కగా సద్వినియోగం చేసుకొని గెలవడంతో పాటు నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని ప్రశంసించినట్టు తెలిసింది.
ఇలా ఉండగా పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ భవన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన తనను పోలీసులు అడ్డుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి అని చూడకుండా తనను కూడా చెక్ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.

'చిత్రం...మున్సిపోల్స్‌లో వ్యూహంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్