తెలంగాణ

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ప్రచార అస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ మున్సిపాల్టీల్లో తమకు బలం ఉన్న ప్రాంతాల్లో సీపీఐ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా పని చేయాల్సిందిగా పార్టీ కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ ముఖ్దూమ్ భవన్‌లో మేడ్చల్ జిల్లా సీపీఐ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే సీపీఐ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్రాల ప్రజా వ్యతిరేక విధానాలే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ అధినేతలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం చెందిన విషయాలను వార్డు స్థాయికి తీసుకుపోవాలన్నారు. నిరుద్యోగ భృతి, పట్టాణాల్లో వౌలిక వసతలు కల్పించడంలో మంత్రి కేటీఆర్ ఘోరంగా విఫలం చెందిన అంశాలను పట్టణ ఓటర్లకు వివరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూలను ప్రకటించడం అప్రజాస్వామ్యమన్నారు. మున్సిపల్ చట్టసభల్లో సీపీఐ గొంతు విన్పించడానికి ఎన్నికల ప్రచారం చేయాలన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేష్ మాట్లాడుతూ పట్టణాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని తెరాస ఎన్నికల హామీలో ఇచ్చిందన్నారు. అయితే, పేదలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో అమలు జరగలేదన్నారు. సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై తీర్మానాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బలం ఉన్న చోట సీపీఐ అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. ఈనెల 20 తేదీ నాటికి పార్టీ సభ్యత్వం పూర్తి చేయాలన్నారు. కూకట్‌పల్లి, బాలనగర్, మండలాల్లో పార్టీ సభ్యత్వం త్వరితగతిగా పూర్తిచేసి, మండల కమిటీలు వేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి డీడీ సాయిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.