తెలంగాణ

కేటీఆర్‌ను సీఎం చేస్తే స్వాగతిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తమ పార్టీ యువ నేత కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి అయితే తామంతా స్వాగతిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని కితాబునిచ్చారు. యువ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను ఈ టర్మ్‌లో సీఎం చేసినా, వచ్చే ఎన్నికల తర్వాత చేసినా ఎప్పుడు చేసినా స్వాగతిస్తామన్నారు. మంత్రి కొప్పుల ఆదివారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేమిటని మంత్రులు వరుసగా ఇటీవల ఒక్కొక్కరుగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కొప్పుల కూడా ఈ అంశంపై స్పందించారు. కేటీఆర్ మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ కొరత తీరి మిగులు విద్యుత్ దిశగా రాష్ట్ర సామార్థ్యాన్ని సాధించిందని, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావచ్చాయని వివరించారు. దాదాపు 78 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగందన్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరిందన్నారు. ఈ నేపథ్యంలో ఇక కేటీఆర్‌ను ఎప్పుడు సీఎం చేసినా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న భయంతోనే రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కనీసం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏదో నాలుగు సీట్లు గెలువగానే ఊహాల్లో విహరిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు.

'చిత్రం... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్