తెలంగాణ

టెక్నాలజీతోనే భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఘట్‌కేసర్, జనవరి 6: ఐటీ అంటే ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇకనుంచి ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇరవై సంవత్సరాలుగా ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా పరిగణిస్తున్నారని, కానీ ఇప్పుడా పరిస్థితి మారిందని, ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రపంచంలో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారానే అవకాశాలను చేజిక్కించుకోగలరని మంత్రి పేర్కొన్నారు. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్‌లో సోమవారం’ ఇంజనీరింగ్ విద్యలో సామాజిక-మానవవీయ కోణం’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. విద్యలో అన్ని దశల్లో నాణ్యత కోసం తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో 220 ఇంజనీరింగ్ కాలేజీలు, వివిధ స్పెషలైజేషన్ కోర్సుతో కలిపి మొత్తంగా 1.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్య నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా నైపుణ్యత లోపించినట్టు తేలిందన్నారు. అందుకే విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించడానికి తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థను (టాస్క్) ఏర్పాటు చేశామన్నారు. గడిచిన ఐదేళ్లలో టాస్క్ ద్వారా 680 కాలేజీలలో 2.9 లక్షల మంది విద్యార్థులకు, 5,070 ఫ్యాకల్టీలకు నైపుణ్యతపై శిక్షణ
ఇచ్చామన్నారు. రెండో దశలో టాస్క్‌ను వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి రెండవ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. జర్మనీలో ఉన్న విధంగా ప్రాక్టీస్ స్కూల్ అప్షన్‌ను రాష్ట్రంలో కూడా ప్రవేశ పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనను జేఎన్‌టీయూ పరిశీలిస్తుందన్నారు. దేశానికి అత్యంత విలువైన సంపద యువతేనన్నారు. జనాభాలో 50 శాతం 27 ఏళ్ల వయసు లోపు వాళ్లే ఉండగా 65 శాతం 35 ఏళ్లలోపు వాళ్లు ఉన్నారని సూచించారు. యువ మానవ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్‌గా మారిందని, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించిందన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌పై నడిచే ఆర్థిక వ్యవస్థగా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితిని అధిగమించడానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం వల్ల విదేశాలలో ఉన్న కొన్ని విద్యా సంస్థలు ఇక్కడ తమ సంస్థలను స్థాపించుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అక్షరాస్యత 70 శాతాన్ని 100 శాతానికి పెంచడానికి సీఎం కేసీఆర్ ఇటీవల ‘ఈచ్ వన్-టీచ్ వన్’ కార్యక్రమాన్ని ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. ఈ లక్ష్య సాధనలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ చైర్మన్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బలమైన దేశంగా మారాలంటే మంచి ఇంజనీర్లు అవసరం అన్నారు. అనుమతి ప్రక్రియలు పూర్తయితే తమ సంస్థ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారబోతుందని పల్లా అన్నారు. ఈ సదస్సుకు 800 మంది ప్రతినిధులు హాజరు కాగా ఇందులో 50 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
'చిత్రం... అంతర్జాతీయ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్