తెలంగాణ

కోర్టు ఉత్తర్వులిస్తేనే నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాల మేరకు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అధికారి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ అధికారి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ, కోర్టులో జరిగిన విచారణకు తమ కమిషన్ తరఫున అడ్వకేట్ హాజరయ్యారని తెలిపారు. కోర్టు ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తామని
వివరించారు. ఎస్‌ఈసీ ఇటీవల జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేయాల్సి ఉంది. హైకోర్టు మంగళవారం జారీ చేసే ఆదేశాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తేనే రిటర్నింగ్ అధికారులు ఈ నెల 8న ఎన్నికల నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఈసీ నడుచుకోవచ్చని కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఈ నెల 8న నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. తర్వాత షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 22న పోలింగ్, 25న కౌంటింగ్ ఉంటాయి.